కియా కార్లు.. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్లు..

కియా కార్లు.. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్లు..

ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణాపై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వాటిని స్వయంగా పరిశీలించిన చంద్రబాబు.. కియా మోటర్స్‌ ఎండీతో కలిసి కాసేపు కార్లో ప్రయాణించారు.

కియా ఎలక్ట్రిక్‌ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం విజయవాడతో పాటు పలు నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.ఏపీలో ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కియా మోటార్స్‌ సహాయపడనుంది. ఒప్పందంలో భాగంగా కియా మోటార్స్‌ సంస్థ ఏపీ ప్రభుత్వానికి 3 ఎలక్ట్రిక్‌ కార్లను బహుమతిగా ఇవ్వనుంది.

ఇప్పటికే కియా సంస్థ తన కార్ల ఫ్లాంట్‌ను అనంతరం పురం జిల్లాలో నెలకొల్పింది. ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కియా మోటార్స్‌. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది.

Back to Top