అబుదాబీ మారథాన్‌ కోసం రోడ్డు మూసివేత

అబుదాబీ మారథాన్‌ కోసం రోడ్డు మూసివేత

అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డిఓటి), అబుదాబీ కోర్నిచ్‌ అలాగే పలు స్ట్రీట్స్‌ని శుక్రవారం తాత్కాలికంగా, పాక్షికంగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. అబుదాబీ మారథాన్‌ కోసం ఈ చర్యలు చేపట్టబోతున్నారు. 42.195 కిలోమీటర్ల మారథాన్‌, 10 కిలోమీటర్స్‌ రేస్‌ నేపథ్యంలో ఈ రోడ్లపై తాత్కాలిక మూసివేత, పాక్షిక మూసివేత అమలు చేస్తున్నారు. వివిధ వయసుల్లో వున్న వారు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. 5 కిలోమీటర్స్‌ రేస్‌, 2 కిలోమీటర్స్‌ ఫన్‌ రన్‌ వంటివి ఈ ఈవెంట్‌లో ఇతర ప్రధాన ఆకర్షణలు. 

Back to Top