వ్యాక్సిన్లు తయారు చేయనున్న కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

- December 17, 2018 , by Maagulf
వ్యాక్సిన్లు తయారు చేయనున్న కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

 

జెడ్డా: కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కెఎయుఎస్‌టి), సౌదీ సెంటర్‌ ఫర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ డెవలపింగ్‌ మెడికల్‌ వ్యాక్సిన్‌ ప్రొటీన్స్‌ని ప్రారంభించింది. మిడిల్‌ ఈస్ట్‌లో ఈ తరహా తొలి ప్రాజెక్ట్‌ ఇదే. రీసెర్చ్‌ ప్రోడక్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ మరియు సౌదీ వ్యాక్స్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో వ్యాక్సిన్స్‌ని తయారు చేస్తారు. కింగ్‌డమ్‌లో కరోనా వైరస్‌ వంటి వ్యాధులకు ఈ వ్యాక్సిన్లతో మరింత మెరుగ్గా చికిత్స అందించడానికి వీలవుతుందని అధికారులు అంటున్నారు. కెఎయుఎస్‌టి రీసెర్చ్‌ కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెఎయుఎస్‌టి స్టార్టప్స్‌, స్టార్టప్‌ ఇస్తాంబుల్‌ 2018 ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఐరిస్‌, ఓయాసిస్‌, యూనిట్‌ ఎక్స్‌ టాప్‌ 100 స్టార్టప్స్‌లో చోటు దక్కించుకున్నాయి. యూనివర్సిటీ, ఎమర్జింగ్‌ కంపెనీస్‌కి సపోర్ట్‌నిస్తూ ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com