తీరాన్ని తాకిన పెథాయ్‌..

- December 17, 2018 , by Maagulf
తీరాన్ని తాకిన పెథాయ్‌..

కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తుఫాను కాట్రేనికోన వద్ద 12:15 గంటలకు తీరాన్ని తాకింది. అమలాపురంకి 20 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుఫాను తీరాన్ని తాకండంతో ఆ ప్రాంతాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు

పెథాయ్‌ తుపాన్‌ కారణంగా శ్రీకుకుళం విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కానీ ఉపాధ్యాయులు, వంట ఏజేన్సీలు, వంట కార్మికులు పాఠశాలల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. అటు విజయనగరం జిల్లాలోనూ పెథాయ్‌ తుపాన్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారలు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోకవరం డిపో నుంచి బయలుదేరాల్సిన పలు బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఆత్రేయపురంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం, కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటి కేశవరం గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలచిపోయింది.

.ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో పెథాయ్‌ తుపాన్‌ కారణంగా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 100 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గుంటూరు జిల్లాలో ఎడతెరపిలేని జల్లులు, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నిజాం పట్నం పోర్టులో 5వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కోన శశీధర్‌ తీరప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇక పెథాయ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీగా పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన రాజప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీని తీవ్రత తూర్పు గోదావరి జిల్లాపైనే అధికంగా ఉంటుందని తెలిపారు. ‘‘ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్ధాల కొరత లేకుండా చూస్తున్నాం. తుపాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుంది.’’ అని మంత్రి చిన రాజప్ప తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com