బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. లక్ష ఉద్యోగ అవకాశాలు

- December 18, 2018 , by Maagulf
బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. లక్ష ఉద్యోగ అవకాశాలు

బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లు కూడా బ్యాంక్ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ పడగానే అప్లై చేయాలనుకుంటారు. ఒకందుకు బ్యాంక్ జాబ్ కూల్ జాబ్. ఎప్పుడూ ఏదో ఒక బ్యాంకుకి సంబంధించిన పోస్టులు కూడా బాగానే పడుతుంటాయి. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ పెరగడం, కొత్త బ్యాంకింగ్ విధానాలను అందిపుచ్చుకోవడంతో బ్యాంకుల్లోనూ భారీ కొలువులు ఉండడంతో విద్యార్ధులు, నిరుద్యోగులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు.
 
ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది లక్షమందిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పీఎన్‌బీ బ్యాంకు కూడా నియామకాలను రెండింతలు చేసినట్టు జాతీయ మీడియా తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా నియామకాలు భారీగానే చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

బ్యాంకులు వెల్త్ మేనేజ్‌మెంట్, అనలిటిక్స్, స్ట్రాటజీ, డిజిటల్, కస్టమర్ సర్వీస్ వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వర్తించే వారిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 20 శాతం క్లర్కులే ఉన్నారు. మొండి బకాయిలు రికవరీ చేసేందుకు లీగల్ ప్రొఫెషనల్స్‌కి కూడా బ్యాంకుల్లో డిమాండ్ బాగా ఉంటోంది.

ఎస్‌బీఐ వచ్చే క్వార్టర్‌లో 5వేల మందిని నియమించనుందని టీమ్ లీజ్ రిపోర్టులో తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ విపరీతంగా పెరిగింది. దీంతో నియామకాల స్థాయి కూడా పెరిగింది. సో.. బ్యాంక్ జాబ్ కొట్టాలనుకునేవారు నోటిఫికేషన్ కోసం వేచి ఉండకుండా ప్రిపరేషన్ మొదలు పెడితే మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com