క్యూబా:విప్లవానికి అరవై ఏళ్ళు!

- December 26, 2018 , by Maagulf
క్యూబా:విప్లవానికి అరవై ఏళ్ళు!

హవానా : ఏళ్ళ తరబడి పోరాటాలు...చివరకు నియంత ఫుల్జేన్సియా బాటిస్టా, అమెరికాలోని అతని మద్దతుదారుల ఓటమి వెరసి ... క్యూబా విప్లవానికిి అరవై ఏళ్ళు... అయినా క్యూబా విప్లవ నేత ఫిడెల్‌ కాస్ట్రో చెప్పినట్లు ''విప్లవాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా తన ప్రయత్నాలను ఎన్నటికీ విరమించుకోదు''. 
''ఈ విప్లవం అధికారంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే శత్రువులు దీనిని అంత తేలికగా వదిలిపెట్టరు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా మనల్ని ప్రశాంతంగా వదిలిపెట్టదు'' 
క్యూబా విప్లవాన్ని డేవిడ్‌ వర్సెస్‌ గోలియత్‌ పోరాటంగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. హింసాత్మక ఆక్రమణ, దోపిడి, పొరుగు దేశాల జోక్యాలకు వ్యతిరేకంగా జ రిగిన పోరాటమే ఈ విప్లవం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com