ఎఫ్2: 'ఎంతో ఫన్' వీడియో సాంగ్ అదిరింది

ఎఫ్2: 'ఎంతో ఫన్' వీడియో సాంగ్ అదిరింది

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనేది ట్యాగ్‌లైన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఫన్ రైడర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా మలిచారని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎంతో ఫన్..' అంటూ ఫన్నీగా సాగిపోతున్న వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో వెంకటేష్, తమన్నాలపై షూట్ చేసిన క్లిప్పింగ్స్ అదరగొట్టేస్తున్నాయి. ఇటీవలే సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం జనవరి 12న విడుదలకాబోతోంది.

Back to Top