ఐర్లాండ్‌:సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన భారతీయ విద్యార్థి

- January 05, 2019 , by Maagulf
ఐర్లాండ్‌:సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన భారతీయ విద్యార్థి

ఐర్లాండ్‌:ఎత్తైన కొండ మీద నుంచి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్‌లోని క్లిఫ్స్‌ ఆఫ్‌ మోహర్‌ కొండ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. డబ్లిన్‌ యూనివర్సిటీలో సదరు యువకుడు విద్యనభ్యసిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా క్లిఫ్స్‌ ఆఫ్ మోహర్‌ నిలిచింది. ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, ఆహ్లాదకర వాతావరణ, పక్కనే సముద్రంతో అత్యంత సుందరమైన ప్రదేశంగా పేరుగాంచింది. ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు పట్టుతప్పడంతో కొండమీద నుంచి జారిపడి సముద్రంలో పడిపోయాడు.

విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. హెలికాప్టర్‌ సహాయంతో సముద్రంలో పడిపోయిన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన విద్యార్థికి సుమారు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడి వివరాలను తెలుసుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com