ఈ నెల 25న సూపర్‌ 30 విడుదలకు సిద్ధమవుతోంది

ఈ నెల 25న సూపర్‌ 30 విడుదలకు సిద్ధమవుతోంది

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న కొత్త చిత్రం సూపర్‌ 30. వికాస్‌ బాల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యావేత్త ఆనంద్‌ కుమార్‌ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. పాట్నా నగరానికి చెందిన ఆనంద్‌.సూపర్‌ 30 అనే కార్యక్రమం ద్వారా అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు ఐఐటీ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి దాకా సూపర్‌ 30 ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందారు. ప్రపంచంలో ఎందరినో ఆలోచింపజేసింది ఆనంద్‌ కుమార్‌ కృషి. సమాజం పట్ల ఆయనకున్న సేవాదృక్పథం ఇప్పుడు బాలీవుడ్‌ను ఆకర్షించింది. ఈ నేపథ్యంతోనే సూపర్‌ 30 రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్‌ 30లో నటించడంపై హృతిక్‌ స్పందిస్తూ..మన జీవితాల్లో అత్యంత గొప్ప విషయం సేవ. సమాజానికి, మన తోటి మనుషులకు సాయం చేయడం అనేది అత్యుత్తమం. నా పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. రేపు నేను వాళ్లకు ఇవ్వబోయే అసలైన ఆస్తి సేవా దృక్పథమే అనుకుంటాను.

ఈ సామాజిక సేవ మన చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తద్వారా ప్రపంచాన్ని మార్చే శక్తినిస్తుంది. అన్నారు. ఈ నెల 25న సూపర్‌ 30 విడుదలకు సిద్ధమవుతోంది.

Back to Top