సౌదీకి పంపించొద్దు అంటున్న యువతి...

- January 07, 2019 , by Maagulf
సౌదీకి పంపించొద్దు అంటున్న యువతి...

సౌదీ అరేబియాకు చెందిన 18 ఏళ్ల రాహఫ్ అల్ కునన్ అనే అమ్మాయి .. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిక్కుకున్నది. కువైట్‌లో ఉన్న తమ పేరెంట్స్ నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో ఆమె థాయిలాండ్ చేరుకున్నది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను ఓ హోటల్‌లో బంధించారు. తిరిగి ఆ టీనేజర్‌ను కువైట్‌లో ఉన్న ఆమె పేరెంట్స్‌కు అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉందని, తాను ఇస్లామ్‌ను వదిలివేశానని, అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థాయ్‌కు వెళ్లిన ఆ టీనేజర్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ దేశమైనా తనకు ఆశ్రయం కల్పిస్తే అక్కడకి వెళ్తానని ఆమె తన వీడియో సందేశంలో కోరింది. ఇస్లామ్‌ను వదిలివేసి ఇంటికి వెళ్లిన వారిని దారుణంగా శిక్షిస్తారని, అందుకే తనకు కువైట్‌కు వెళ్లాలని లేదని ఆమె చెబుతోంది. ఐక్యరాజ్యసమితి తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతోంది. గత ఏడాది ఆరంభంలో కూడా ఓ మహిళ ఇలాగే కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించింది.

ఆమెను పిలిప్పీన్స్ నుంచి కువైట్‌కు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ మహిళ ఆచూకీ తెలియలేదు. అందుకే రాహఫ్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com