టెర్రర్‌ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు

- January 07, 2019 , by Maagulf
టెర్రర్‌ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు

బహ్రెయిన్‌: ఫస్ట్‌ హై అప్పీలేట్‌ క్రిమినల్‌ కోర్టు టెర్ర్‌ కేసులో బహ్రెయినీ నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, పోలీస్‌ అధికారులపై దాడికి దిగినట్లు విచారణలో నిరూపితమయ్యింది. మరికొందరితో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్టోవ్‌ కాక్‌టెయిల్స్‌, ఇతర పేలుడు పదార్థాలతో నిందితుడు దాడి చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలోఓ పోలీస్‌ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసులో తొలి నిందితుడు, మరికొందరు సభ్యుల్ని చేర్చుకుని టెర్రర్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్‌ పేర్కొన్నారు. నిందితులందరిపైనా టెర్రర్‌ కేసులు నమోదయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com