"వాట్సాప్ గోల్డ్ ఫీచర్"

- January 07, 2019 , by Maagulf

ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని.
ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని. ఇది వాట్సప్ కొత్తగా పెట్టిన అప్ గ్రేడ్ వర్షన్ అంటూ వాట్సప్ లో వెంటనే దీన్ని డౌన్ లోడ్ చేసుకోండని ఓ మెసేజ్ అందరికీ వస్తోంది. అయితే ఈ మెసేజ్ అంతా ఫేక్ తో కూడుకున్నది. మీరు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ మొబైల్ డేటా సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.

వాట్సాప్ గోల్డ్ ఫీచర్....

"వాట్సాప్ గోల్డ్ ఫీచర్" పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్ లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది. అందువల్ల మీకు అలంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి.

వాట్సాప్ ఈ ఏడాది 4 కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది.అవేంటో చూడండి


Consecutive Voice Messages

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్ ని ఆటోమేటిగ్గా ప్లే చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే అది ఆటోమేటిగ్గా వాయిస్ ని వినిపిస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. బీటావర్షన్ లో అందుబాటులో ఉంది.

డార్క్ మోడ్
కంపెనీ ఈ ఏడాది జనవరిలో ఈ ఫీచర్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కంటి సమస్యల నుండడి కొంత మేరకు గట్టెక్కే అవకాశం ఉంది. లో లైట్ కండిషన్లో కూడా ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

మీడియా ప్రివ్యూ
ఈ ఫీచర్ మీడియాను అయినా అల్లో చేసే విధంగా అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుంగానే ఫోటోలు, వీడియో, ఆడియో వంటి వాటిని వరుస క్రమంలో చూడవచ్చు.

కాంటాక్ట్స్ ర్యాంకింగ్
ఈ ఫీచర్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. మీరు కమ్యూనికేట్ అయ్యే యూజర్లు ఎంత ర్యాంకులో ఉన్నారనే విషయం ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చే. ఈ ఏాది వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com