రిపబ్లిక్‌ డే: ఏపీ, తెలంగాణ శకటాలను తిరస్కరించిన కమిటీ

- January 08, 2019 , by Maagulf
రిపబ్లిక్‌ డే: ఏపీ, తెలంగాణ శకటాలను తిరస్కరించిన కమిటీ

హైదరాబాద్‌: రిపబ్లిడే సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపించింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ విభాల శకటాలకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. ఢిల్లీలో జరినే రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించడం సర్వసాధారణం. ఇందులోభాగంగా ప్రతీ ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలియచేసే శకటాలను ప్రదర్శిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ జెండా వందనం నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను అక్కడ ఊరేగిస్తారు. ఆయా రాష్ట్రాల ప్రత్యేకతను తెలియచేసేలా శకటాలను ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఏటా ఏర్పాటు చేస్తున్న మాదిరిగా కాకుండా శకటాలను కొంచెం ప్రత్యేకతగా ఉంటేటట్లు రూపొందించాలని సంబంధిత కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందులోభాగంగా ఈ సారి జరిగే రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన జీవితంతో సంబంధం ఉండేలా ఆకృతులను తయారు చేయాలని అగస్టు నెలలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ సూచించింది. కేంద్రం చెప్పినట్లుగా రెండు రాష్ట్రాలు శకటాలను రూపొందింప చేస్తున్నాయి.

ఈవిధంగా రూపొందించిన శకటాలను ముందుగా కేంద్ర రక్షణ శాఖకు చూపించాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా ఆయా రాష్ట్రాలు 3 డీ మోడల్స్‌ను పంపించాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల శకటాలకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తెలంగాణ అధికారులు తయారు చేసిన శకటం ఈ సారి కూడా ఢిల్లీలో అధికారులను మెప్పించ లేకపోయింది.

2015 సంవత్సరంలో బోనాల థీమ్‌తో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శకటం 2016, 2017, 2018లోనూ అవకాశం దక్కించుకో లేదు. 2016, 1017లో బతకమ్మ థీమ్‌ని పంపగా అది అధికారులను మెప్పించడంలో విఫలమైంది. కాగా 2018లో మేడారం జాతర థీమ్‌ని పంపించారు. అది కూడా అధికారులను మెప్పించ లేకపోయింది.

ఈ ఏడాది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన మీద తెలంగాణ అధికారులు తయారు చేసిన శకటం అక్కడి అధికారులను ఆకట్టులేకో లేకపోయింది. దీంతో మరోసారి తెలంగాణకు అవకాశం దక్క లేదు. అదేవిధంగా విజయవాడలోని గాధీ కొండ, పుందూరు ఖద్దరు, మహిళలు బంగారం అందిస్తున్నట్లుగాను, కొండపై గాంధీ ఉపదేశం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని రూపొందించింది. అయితే ఆఖరి రౌండ్‌లో తొలగిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకు తొలగించారో దానిపై సరియైన వివరణ ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ శకటాన్ని వద్దనడం తమకు బాధను కలిగించిందని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తయారు చేసిన ఈ నమూనాను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి అంగీకరించిందని, ఆపై తాము త్రీడీ నమూనాను అందించామని అధికారులు తెలిపారు.

అప్పటి వరకూ అంతా బాగానే ఉందని చెప్పిన రక్షణ శాఖ తదుపరి ఎందుకు వద్దన్నదో అర్ధం కావడం లేదని ఏపీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com