భారత్ బంద్..రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు

- January 08, 2019 , by Maagulf
భారత్ బంద్..రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ తో కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపటంతో దేశ వ్యాప్తంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శిస్తు..8,9 తేదీల్లో జరిగే ఈ భారత్ బంద్‌ లో భాగంగా..రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

సాధారణ ప్రజలతో పాటు రైతులు కూడా పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు బంద్ లో పాల్గొన్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న తరహా పరిశ్రమలు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, బ్యాంకింగ్, బీమా రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొంటం విశేషం.
ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ తో పాటు మరో 30 ప్రజా సంఘాలు కూడా జనవరి 8న అస్సాం బంద్‌కు పిలుపునివ్వగా..నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ బంద్ లో పాల్గొంటోంది. ఈ సమ్మెకు కొన్ని బ్యాంక్ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి. 

పశ్చిమ్ బెంగాల్‌లో ఉదయాన్నే హౌరా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని రైళ్లు కదలకుండా అడ్డుకున్నారు. బలవంతంగా వ్యాపార సంస్థలు, దుకాణాలను ఆందోళనకారులు మూసివేయిస్తున్నారు. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ రైల్ రైకో నిర్వహిస్తోంది. ఒడిశాలో కార్మికులు రోడ్లపైకి చేరి ఆందోళన చేపట్టారు. టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలో బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చేపట్టిన బంద్‌తో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోనూ పలు కార్మిక సంఘాలు రోడ్లపైకి చేరి ఆందోళన చేపట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com