‘కథానాయకుడు’ టికెట్ల వేలం

‘కథానాయకుడు’ టికెట్ల వేలం

ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎదురుచూసిన రోజూ రానే వచ్చింది. సినిమా టికెట్ల కోసం అభిమానులు, కార్యకర్తలు ఎగబడుతున్నారు. అమెరికాలో అయితే ఎన్టీయార్ అభిమానులు టికెట్లను వేలం వేశారు. అయితే ఈ డబ్బును కూడా ఓ మంచి కార్యక్రమానికి వినియోగించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికాలో వేలం వేసిన తొలి టికెట్ ను ఓ ఎన్నారై 3లక్షల 55వేలకు కొన్నారు. ఈ మొత్తం డబ్బును డిస్ట్రిబ్యూటర్ ఎన్టీయార్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.

Back to Top