సంక్రాంతి ఎఫెక్ట్:ఆకాశాన్నంటుతున్న విమాన టిక్కెట్ల ధరలు

- January 09, 2019 , by Maagulf
సంక్రాంతి ఎఫెక్ట్:ఆకాశాన్నంటుతున్న విమాన టిక్కెట్ల ధరలు

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా విమానాయాన సంస్థలు ధరలను భారీగా పెంచాయి. పది రెట్లు ధరలను పెంచాయి. బస్సులు, రైళ్లలో సీట్లు దొరకాలంటే కనీసం మూడు మాసాల పాటు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విమానాల వైపు చూస్తున్న ప్రయాణీకుల జేబులు చిల్లులు పడాల్సి వస్తోంది.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వగ్రామాలకు విమానంలో వెళ్లాలంటే తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా పెద్ద ఎత్తున విమానాయాన సంస్థలను ఛార్జీలను పెంచేశాయి.

ఈ నెల 10,11 తేదీల్లో ఈ ఛార్జీలు మరింత ఎక్కువగా పెంచారు. సాధారణ రోజుల్లో హైద్రాబాద్ నుండి రాజమండ్రి వరకు సుమారు. రూ.3వేలు వసూలు చేస్తారు. సాధారణ రోజుల్లో మరింత డిమాండ్ ఉంటే రూ.5వేలు వసూలు చేసేవారు. కానీ, పండుగ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున 10 రెట్లు చార్జీలను పెంచేశారు. హైద్రాబాద్ నుండి రాజమండ్రికి ఒక్కరికి రూ. 20 వేలు వసూలు చేస్తున్నారు.హైద్రాబాద్ నుండి విజయవాడకు రూ.50వేలు, హైద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి రూ.40వేలుగా నిర్ణయించారు.

ఈ నెల 17,18 తేదీల్లో ఈ ఛార్జీలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బస్సులు, రైళ్లలో టిక్కెట్టు దొరికని వారు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా ఛార్జీలు పెంచడంతో విమానాలపై దృష్టి పెట్టారు. అయితే ఈ డిమాండ్ కారణంగా విమానాయాన సంస్థలు కూడ భారీగా ఛార్జీలను పెంచేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com