తమిళనాడులో ఫ్యాన్స్‌ వార్‌

తమిళనాడులో ఫ్యాన్స్‌ వార్‌

తమిళనాడులో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఏకంగా ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకునే స్థాయి వరకు వెళ్లింది అభిమానుల గొడవ. ఇవాళ పొంగల్‌ కానుకగా రజనీకాంత్‌ నటించిన పేట సినిమా.. అజిత్‌ నటించిన విశ్వాసం సినిమా విడుదలయ్యాయి. దీంతో తమిళనాడులో ఇద్దరు హీరోల అభిమానుల గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పలు చోట్ల ఫ్యాన్స్‌ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
 
వేలూరులోని రోహిణి థియేటర్‌ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో నలుగురు పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్‌ అంటూ దాడులకు తెగబడ్డారు.

Back to Top