సౌదీ అమ్మాయికి కెనడా ఆశ్రయం

- January 12, 2019 , by Maagulf
సౌదీ అమ్మాయికి కెనడా ఆశ్రయం

సౌదీ అరేబియాకు చెందిన 18 ఏళ్ల రాహఫ్ అల్ కునన్ అనే అమ్మాయికి కెనడా దేశం ఆశ్రయం కల్పించింది. కువైట్‌లోని తన ఫ్యామిలీ నుంచి పరారీ అయిన ఆమె ఇటీవల థాయిలాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకున్న ఆమె సోషల్ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించింది. ఆ తర్వాత రాహఫ్‌కు ఆశ్రయం కల్పించేందుకు కెనడా ముందుకు వచ్చింది. వాస్తవానికి బ్యాంకాక్ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఓ హోటల్‌లో నిర్బంధించారు. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె పోరాటం సాగించింది. అసలేం జరిగింది.. పేరెంట్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాహఫ్ ఎవరికీ చెప్పకుండా థాయిలాండ్ చేరుకున్నది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను కొన్ని రోజుల క్రితం ఓ హోటల్‌లో బంధించారు. తిరిగి ఆ టీనేజర్‌ను కువైట్‌లో ఉన్న ఆమె పేరెంట్స్‌కు అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉందని, తాను ఇస్లాం మతాన్ని వదిలివేశానని, అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థాయ్‌కు వెళ్లిన ఆ టీనేజర్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ దేశమైనా తనకు ఆశ్రయం కల్పిస్తే అక్కడకి వెళ్తానని ఆమె తన వీడియో సందేశంలో కోరింది. ఇస్లామ్‌ను వదిలివేసి ఇంటికి వెళ్లిన వారిని దారుణంగా శిక్షిస్తారని, అందుకే తనకు కువైట్‌కు వెళ్లాలని లేదని ఆమె తన వీడియో సందేశంలో చెప్పింది. ఐక్యరాజ్యసమితి తనకు ఆశ్రయం కల్పించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com