కొత్త విమానాల్ని ప్రకటించిన ఇండియన్‌ ఎయిర్‌లైన్‌

కొత్త విమానాల్ని ప్రకటించిన ఇండియన్‌ ఎయిర్‌లైన్‌

మస్కట్‌: ఇండియాకి చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ గో ఎయిర్‌, వారంలో ఏడు విమానాలు నడిపే దిశగా కొత్త ప్రకటనను విడుదల చేసింది. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కేరళలోని కన్నుర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఈ విమానాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ఒమన్‌ - పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఏ) పేర్కొంది. గో ఎయిర్‌ ఆపరేషన్‌కి సంబంధించి అనుమతులు మంజూరు చేసినట్లు పిఎసిఎ ట్విట్టర్‌ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. లో కాస్ట్‌ ఇంటర్నేషనల్‌ కెరియర్‌ అయిన గో ఎయిర్‌, ముంబై కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఇండియాలో ఐదో అతి పెద్ద ఎయిర్‌లైన్‌గా 2017లో గో ఎయిర్‌ గుర్తింపు తెచ్చుకుంది. ఇంకో వైపు కేరళలో ఐదవ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్నుర్‌ పేరుగాంచింది. 

Back to Top