రెండవ ఖాసిమ్‌ బుక్‌ ఫెయిర్‌కి అనూహ్య స్పందన

రెండవ ఖాసిమ్‌ బుక్‌ ఫెయిర్‌కి అనూహ్య స్పందన

 

జెడ్డా: రెండవ ఖాసిమ్‌ బుక్‌ ఫెయిర్‌కి అనూహ్య స్పందన లభించింది. బురైదా మునిసిపాలిటీ ఈ బుక్‌ ఫెయిర్‌ని నిర్వహించింది. శుక్రవారం బుక్‌ ఫెయిర్‌కి వేలాదిమంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఖాసిమ్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ మరియు ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగిన ఈ బుక్‌ ఫెయిర్‌ సందర్భంగా పలు కల్చరల్‌ ఈవెంట్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. 200కి పైగా పబ్లిషింగ్‌ హౌసెస్‌ ఈ బుక్‌ ఫెయిర్‌లో పాలుపంచుకున్నాయి. పలు ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, ఆథర్స్‌ ఈ భృహత్‌ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. అరబ్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ అల్‌ హమ్దాన్‌ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చదవడం పట్ల సమాజంలో అవగాహనను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.

Back to Top