రోడ్డు ప్రమాదంలో కువైటీ మృతి

రోడ్డు ప్రమాదంలో కువైటీ మృతి

కువైట్‌ సిటీ: కువైట్‌లోని మినా అబ్దుల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసమయ్యింది, అగ్ని కీలల కారణంగా కారు దహనం కాగా, ఓ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

Back to Top