అబుదాబీలో షేక్‌ జాయెద్‌ మాస్క్‌ని సందర్శించిన రాహుల్‌గాంధీ

అబుదాబీలో షేక్‌ జాయెద్‌ మాస్క్‌ని సందర్శించిన రాహుల్‌గాంధీ

అబుదాబీ:ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌, రెండు రోజుల యూఏఈ పర్యటన కోసం దుబాయ్‌ విచ్చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన దుబాయ్‌లోని భారతీయ వలసదారులతో మాట్లాడారు. శుక్రవారం అల్‌ జబెల్‌ అలి ఇండస్ట్రియల్‌ ఏరియాలో మహిళా కార్మికుల అకామడేషన్‌ని సందర&ఇశంచారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని బ్లూ కాలర్‌ వర్కర్స్‌ని ఉద్దేశించి మాట్లాడారు. మరోపక్క యూఏఈ విద్యార్థులతో శనివారం ఉదయం 50 నిమిషాలపాటు రాహుల్‌గాంధీ ముచ్చటించారు. ఇదిలా వుంటే, అబుదాబీలో రాహుల్‌గాంధీ, మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ టాలరెన్స్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ని కలిశారు. అలాగే షేక్‌ జాయెద్‌ మాస్క్‌నీ సందర్శించారు రాహుల్‌గాంధీ. 

 

Back to Top