గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

- January 16, 2019 , by Maagulf
గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

దోహా: ఈ వీకెండ్‌ మరింత గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు ఖతార్‌ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ అంచనా వేస్తోంది. జనవరి 17 నుంచి 19 వరకు ఈ ప్రభావం వుంటుంది. నార్త్‌ వెస్టర్లీ విండ్‌ కారణంగా ఈ ఉష్ణోగ్రతల తగ్గుదల కన్పిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 డిగ్రీల మధ్యన, అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 నుంచి 14 వరకు వుండొచ్చని అంచనా వేస్తున్నామనీ, కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని మెటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువగా వుంటుందనీ, సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాలు 7 నుంచి 10 అడుగుల మేర వుండొచ్చనీ, ఒక్కోసారి ఇవి 15 అడుగుల వరకు పెరిగినా ఆశ్చర్యం వుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com