ఇండియాలో నిబంధనలు కఠినం చేసిన ఫేస్‌బుక్‌

- January 16, 2019 , by Maagulf
ఇండియాలో నిబంధనలు కఠినం చేసిన ఫేస్‌బుక్‌

ఇండియా:ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ ఇండియా లో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. ఇండియా లో మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సిన ఇండియా, నైజీరియా, ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్లలో రాజకీయ ప్రకటనలపై నిబంధనలు కఠినం చేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ప్రకటనలలో రాజకీయాలకు సంబంధించిన జోక్యం అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
దాదాపు అన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌ అతి పెద్ద సోషల్‌ మీడియా. రాజకీయ నాయకులు వివిధ ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకోవడమే కాకుండా నకిలీ వార్లలు, ఇతర అనవసర ప్రచారాలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని ఎన్నికల నిబంధనలకు, కంపెనీ పాలసీలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అధికార వర్గాల నుంచి ఫేస్‌బుక్‌పై ఒత్తిళ్లు రావడంతో ఫేస్‌బుక్‌ గత ఏడాది రాజకీయ ప్రకటనలను పర్యవేక్షించేందుకు పలు రకాల ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇండియా లో వచ్చే నెల నుంచి రాజకీయాలకు సంబంధించిన ప్రకటనలను సెర్చ్‌ చేయడానికి వీలైన ఆన్‌లైన్‌ లైబ్రరీలో ఉంచనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఇది కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేమని, కానీ కొద్ది కొద్దిగా మెరుగు చేసుకుంటూ వెళ్తామని పేర్కొన్నారు. నైజీరియాలో ఈరోజు నుంచి ఈ పాలసీ ప్రారంభిస్తున్నామని, ఉక్రెయిన్‌లో వచ్చే నెలలో మొదలుపెడతామని చెప్పారు. నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానుండగా, ఉక్రెయిన్‌లో మార్చి 31 నుంచి జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com