దుబాయ్:ఎన్టీఆర్‌ 23వ వర్థంతి సంధర్భంగా తెలుగు ప్రవాసీయులు ఘన నివాళి

- January 18, 2019 , by Maagulf
దుబాయ్:ఎన్టీఆర్‌ 23వ వర్థంతి సంధర్భంగా తెలుగు ప్రవాసీయులు ఘన నివాళి

దుబాయ్:యూఏఈ లోని తెలుగు ప్రవాసీయులు ఎన్టీఆర్ వర్థంతి సంధర్భంగా అయన చేసిన ఘనతను స్మరించుకుంటూ ఓ తెలుగు బిడ్డ నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ బిడ్డలు   అని గుర్తుచేసుకున్నారు. తెలుగుప్రజలేకాకుండా  తమిళప్రజలు , కన్నడ ప్రజలు కూడా వర్థంతి జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకుని స్వచ్చందంగా పాల్గొన్నారు . అయన చేసిన సేవలను తరతరాలకు గుర్తుండి పోయేలా ఉన్నాయని  స్మరించుకున్నారు , దేశవిదేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నతి స్తానం దొరకడం కేవలం ఎన్టీఆర్ ఆనాడు చేసిన ఎన్నో పనులేనని  తెలుగు ప్రజలు స్మరించుకున్నారు.  

ఇప్పటికీ, రేపటికి, భవిష్యత్‌కి రైతుల కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. హెచ్‌పీకి రూ.50 తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని, 2 రూపాయల బియ్యానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని ప్రవాసీయులు  కొనియాడారు. పరిపాలన అంటే ఏవిధంగా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. అధికారం కోసం ఆయన పార్టీ పెట్టలేదని, డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ శాశ్వతంగా ఉంటారని పాల్గొన్న వక్తలు  వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com