ఇనీషియల్‌ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేయనున్న యూఏఈ హైపర్‌లూప్‌

- January 18, 2019 , by Maagulf
ఇనీషియల్‌ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేయనున్న యూఏఈ హైపర్‌లూప్‌

ప్రపంచంలోనే తొలి సూపర్‌ ఫాస్ట్‌ హైపర్‌ లూప్‌ ట్రెయిన్‌ సిస్టమ్‌ని అరబ్‌ ఎమిరేట్స్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి ఇనీషియల్‌ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేయనున్నారు. ఫస్ట్‌ ఫేజ్‌లో ఈ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎలోన్‌ మస్క్‌ - హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ 10 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని తొలి దశలో పూర్తి చేయనుంది. అబుదాబీ మరియు దుబాయ్‌ని కలిపే 150 కిలోమీటర్ల దూరంలోని ఓ భాగమిది. కంపెనీ ఛైర్మన్‌ బిపాప్‌ గ్రెస్టా మాట్లాడుతూ, 3 నుంచి 6 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మితమవుతోందని తెలిపారు. గత ఏప్రిల్‌లో హైపర్‌లూప్‌, అల్‌ దార్‌ ప్రాపర్టీస్‌తో కలిసి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ ట్రైన్‌కి సంబంధించి తొలి క్యాప్సూల్‌ స్పెయిన్‌ నుంచి టోలౌస్‌కి అసెంబ్లీ ఫెసిలిటీ చేరుకుంది. ఫ్రాన్స్‌లోని టోలౌస్‌లో ప్రోటో టైప్‌ ట్రాక్‌ని పరీక్షిస్తారు. మ్యాగ్నెటిక్‌ రెయిల్స్‌పై హైపర్‌ లూప్‌ పరుగులు తీస్తుంది. ట్యూబ్‌లో తక్కువ గాలి లేదా అసలు గాలి లేకుండా ఈ ట్రైన్‌ ప్రయాణిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com