హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆన్‌లైన్‌లో.. అతి త్వరలో

- January 29, 2019 , by Maagulf
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆన్‌లైన్‌లో.. అతి త్వరలో

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, వలసదారుల కోసం హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ని త్వరలో ఆన్‌లైన్‌ చేయబోతోంది. ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా సంబంధిత ఫీజు చెల్లించేలా ఈ ఆన్‌లైన్‌ విధానం ఉపకరిస్తుంది.. ఆటోమేటెడ్‌ సర్వీస్‌, ఆర్టికల్స్‌ 17, 18, 19, 20, 22, 23, 24 ద్వారా వలసదారులకు హెల్త్‌ కవర్‌ అంఇస్తుంది. రెసిడెన్స్‌ పర్మిట్‌ డిపార్ట్‌మెంట్స్‌, పేపర్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లను తీసుకోవడం కొనసాగిస్తుందనీ, మార్చి తర్వాత మాత్రం పూర్తిగా ఆటోమేటెడ్‌ పేమెంట్‌ సర్వీస్‌ ద్వారా మాత్రమే అన్ని వ్యవహారాలూ జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మేన్‌ పవర్‌ పబ్లిక్‌ అథారిటీ, పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ తదితర విభాగాలు లింక్‌ అప్‌ అయి, హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ను వలసదారులకు అందిస్తాయని, ఎలాంటి అదనపు పీజులు లేకుండా ఈ సేవలు అందే అవకాశం వుందనీ తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com