చైనా:ప్రారంభమైన కొత్త సంవత్సర రద్దీ

- January 31, 2019 , by Maagulf
చైనా:ప్రారంభమైన కొత్త సంవత్సర రద్దీ

బీజింగ్‌ : చైనాలో కొత్త సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పట్టణాల నుండి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణీకులతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. చైనా సౌరమానం ప్రకారం మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వరాహ నామ సంవత్సరంలో కుటుంబ, బంధు మిత్రులందరూ ఒక చోట కలుసుకుంటారు. విందులు, వినోదాలతో సరదాగా గడుపుతారు. చైనీయులకు అన్ని పండగలకన్నా అతి పెద్ద పండగ ఇదే. ఈ వేడుకల కోసం విదేశాల్లో వివిధ వృత్తుల్లో పని చేస్తున్న చైనీయులంతా స్వస్థలాలకు తరలి వస్తుండడంతో బీజింగ్‌ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో రద్దీ బాగా పెరిగింది. వణికిస్తున్న చలిలో లగేజీ తీసుకుని. బీజింగ్‌ నుంచి సెంట్రల్‌ చైనాలోని హునాన్‌ రాష్ట్రంలోని హువాయి హుయాకు చేరుకునేందుకు 32 గంటలపాటు రైలు ప్రయాణం చేయాల్సి వున్న కుటుంబాలు రైల్వే స్టేషన్‌లో ఒక చేతిలోఛారు మరో చేతిలో మొబైల్‌ ఫోన్లతో అటు ఇటు తిరుగుతుండడం కనిపిస్తుంది. విశ్రాంతి గదులు నిండిపోవడంతో ప్లాట్‌ఫామ్‌లపై మడత పెట్టేందుకు వీలుండే స్టూళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. స్లీపర్‌ క్యాబిన్లలో కుటుంబ సభ్యులలు తినుబండారాలు తినడం, ఫోన్‌లో ముచ్చట్లాడుకోవడం, పిల్లలతో కారిడార్లలో ఆటలాడుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తున్నారు. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేస్‌ శాఖ 41.3 కోట్ల అదనపు ట్రిప్పులను నడుపుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌తో పోల్చితే ఈ సారి రైల్వేస్‌ 8.3 శాతం అధిక ట్రిప్పులు నడుపుతున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com