అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ

అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ

వివిధ కేసుల్లో చిక్కుకున్న భారత కార్మికులకు ఊరట కలిగించేలా అబుదాబీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పటి వరకు అబుదాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్ధంకాక కష్టాలు పడేవారు. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ, వారి హక్కులు, విధులు సులభంగా అర్ధమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. యూఏఈ లో ఉన్న జనాభా సంఖ్య 50 లక్షలు అయితే అందులో 2/3 వంతు ఉన్నారు. 

 

Back to Top