తెలంగాణ:ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్‌

- February 11, 2019 , by Maagulf
తెలంగాణ:ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్‌

హైదరాబాద్: ముస్లిములు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ-ఖజ్జత్(ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు విధానాన్ని మహమూద్ అలీ, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ సలీం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ-ఖజ్జత్ విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి వచ్చే వారని, ఇప్పుడు ఆ సమస్య తలెత్తదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, గడువు తేదీన కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. WAQF.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com