ఢిల్లీ హోటల్ ఆర్పిట్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం

ఢిల్లీ హోటల్ ఆర్పిట్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో గల హోటల్ ఆర్పిట్ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహన మయ్యారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.

తీవ్రంగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. గాయపడ్డ పలువురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.

సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. భారీగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. 

Back to Top