బిఎఫ్‌హెచ్‌ బీచ్‌లో విద్యార్థి మృతదేహం

బిఎఫ్‌హెచ్‌ బీచ్‌లో విద్యార్థి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ళ వలస విద్యార్థి మృతదేహం బహ్రెయిన్‌ ఫైనాన్షియల్‌ హార్బర్‌ బీచ్‌లో లభించింది. మృతురాల్ని ప్రభా సుబ్రమనియన్‌గా గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌కి చెందిన విద్యార్థి ప్రభా సుబ్రమణియన్‌. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది. ప్రభా తండ్రి వ్యాపార వేత్త అని తెలుస్తోంది. ఆమెకు తండ్రి, తల్లి, ఓ సోదరుడు ఉన్నారు. కాగా, గత మే నెలలో 14 ఏళ్ళ స్టూడెంట్‌, స్కూల్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సైకియాట్రిస్ట్‌ అనీషా అబ్రహామమ్‌ అలాగే మరియమ్‌ అలామాది మాట్లాడుతూ, చిన్న వయసులో ఎదురయ్యే పెద్ద పెద్ద ఛాలెంజెస్‌ని ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. 

 

Back to Top