సౌదీలో 14వ ఔట్‌లెట్‌ ప్రారంభించిన మలబార్‌ గోల్డ్‌

సౌదీలో 14వ ఔట్‌లెట్‌ ప్రారంభించిన మలబార్‌ గోల్డ్‌

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, సౌదీ అరేబియాలో 14వ ఔట్‌లెట్‌ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో 250 ఔట్‌లెట్స్‌తో జ్యుయెలరీ రంగంలో అతి పెద్ద సంస్థగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుంటోంది మలబార్‌ గోల్డ్‌. ఫిబ్రవరి 7న ఎంపిఅహ్మద్‌ (మలబార్‌ గోల్డ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌) చేతుల మీదుగా ఈ 14వ షోరూం ప్రారంభమయ్యింది. మదినాలోని అల్‌ మునావరాలో అల్‌ మస్జిద్‌ గేట్‌ 17కి దగ్గరలో ఈ షోరూంని ఏర్పాటు చేశారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ జెడ్డాలోనూ, అల్‌ బలాద్‌లోనూ ఫిబ్రవరి 6న రెండు షోరూంలను ప్రారంభించడం గమనార్హం. కొత్త ప్రారంభోత్సవాల నేపథ్యంలో ప్రారంభోత్సవ ఆఫర్లను సంస్థ ప్రకటించింది. 3,000 సౌదీ రియాల్స్‌తో కొనుగోలు జరిపేవారికి 1 గ్రామ్‌ గోల్డ్‌ కాయిన్‌ని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే 22 క్యారెట్‌ గోల్డ్‌ జ్యుయెలరీకి సంబంధించి జీరో డిడక్షన్‌ ఎక్స్‌ఛేంజ్‌ పొందే వీలుంది. జెడ్డా అల్‌ బలాద్‌ స్టోర్స్‌ మదినా మునావరా స్టోర్స్‌లో ఫిబ్రవరి 23 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో వుంటుంది. 

 

Back to Top