పాక్ కి వర్మ పంచ్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

- February 21, 2019 , by Maagulf
పాక్ కి వర్మ పంచ్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. పాక్ కి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఐతే, ఈ ఘటనపై ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందిస్తూ.. 'పుల్వామా దాడికి తమను నిందించడం సరికాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమపై ఆరోపణలు చేస్తోంది. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి' అని అన్నారు. తాజాగా, ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

'డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.. చర్చలతోనే సమస్యలు పరిష్కారమయ్యేటట్లైతే.. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా.. ఓ వ్యక్తి ఆర్డీఎక్స్‌ పట్టుకుని మావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనితో చర్చలు ఎలా జరపాలో మా భారతీయులకు నేర్పించండి సర్‌. నేర్పించినందుకు మీకు ట్యూషన్‌ ఫీజు కూడా చెల్లిస్తాం సర్‌. మీ దేశంలో ఒకప్పుడు ఒసామా బిన్‌లాడెన్‌ ఉన్నాడని అమెరికాకు తెలిసినప్పుడు మీకెందుకు తెలీదు? కనీసం మీ దేశంలో ఎవరు ఉంటున్నారో కూడా తెలీనప్పుడు అదీ ఓ దేశమేనా? నాకు తెలీక అడుగుతున్నాను సర్‌.. ప్లీజ్‌ చెప్పండి. జైషే మహమ్మద్‌, లష్కరే, తాలిబన్‌, ఆల్‌ఖైదా సంస్థలు మీ ప్లే స్టేషన్స్‌ కాదని నాకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆ సంస్థలకు వ్యతిరేకమని మీరూ ఎప్పుడూ చెప్పలేదు. మీకు బాంబులు క్రికెట్‌ బంతుల్లా కనిపిస్తున్నాయా సర్..' అంటూ తనదైన శైలిలో పాక్‌ ప్రభుత్వానికి చురకలంటించారు రాంగోపాల్ వర్మ.

ఇన్నాళ్లు వర్మ చేసే వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చేది. పబ్లిసిటీ కోసం వర్మ ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారని చెప్పుకొనేవారు. ఐతే, పాక్ ప్రధానికి వర్మ ఇచ్చిన కౌంటర్‌ అదిరిపోయిందంటూ ప్రశంసలు కురుస్తున్నాయ్. శభాష్.. వర్మ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com