వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ల యూజర్లను బ్యాన్‌ చేసిన వాట్సాప్‌

- March 12, 2019 , by Maagulf
వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ల యూజర్లను బ్యాన్‌ చేసిన వాట్సాప్‌

వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సాప్‌ల యూజర్లను బ్యాన్‌ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తెలిపింది. వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వాట్సాప్‌లను వినియోగిస్తున్న యూజర్లను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ అనుబంధ యాప్‌లను థర్డ్‌పార్టీ డెవలపర్లు తయారు చేశారు. అయితే, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అధికారిక వాట్సాప్‌ నియమ నిబంధనలను, సేవలను అతిక్రమించడంతో ఈ చర్యలకు దిగినట్లు వాట్సాప్‌ పేర్కొంది. వినియోగదారులందరూ అధికారిక వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ వెర్షన్లను వినియోగిస్తున్న వారు అధికారిక వాట్సాప్‌నకు ఎలా మారాలో కూడా సూచనలు చేసింది.
''మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది' అని మీ వాట్సాప్‌నకు సందేశం వస్తే, మీరు అఫిషియల్‌ వాట్సాప్‌ను కాకుండా థర్డ్‌ పార్టీ తయారు చేసిన వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్లు అర్థం. వాట్సాప్‌ను వినియోగించడానికి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే'' అని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇప్పటి వరకూ మీ స్నేహితులతో కొనసాగించని సంభాషణలన్నీ అఫిషియల్‌ వాట్సాప్‌కు బదిలీ చేసే విషయంలో గ్యారెంటీ ఇవ్వలేమని తెలిపింది. ఎందుకంటే అనధికార యాప్స్‌కు తాము మద్దతు తెలపమని స్పష్టం చేసింది. 
మీరు ఏ వాట్సాప్‌ వాడుతున్నారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!
* Open your app.
* Go to 'More Options' GO
* Go to 'Settings'
* Tap on Help
* name from App info.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com