ఎం ఎన్ ఆర్ గుప్తా కు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం

- March 14, 2019 , by Maagulf
ఎం ఎన్ ఆర్ గుప్తా కు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం

హైదరాబాద్, మార్చి 11: నిత్య చైతన్య వంతుడు, తన వాక్చాతుర్యం తో యువత లో స్ఫూర్తిని రగిలిస్తూ, మరెందరికో మార్గదర్శిగా నిలుస్తూ, ఎంతో మంది యువతకు కెరీర్ పరంగా విలువైన సలహాలిస్తూ, విదేశాలలో జయకేతనం ఎగురవేసిన తెలుగు యువ కిరణం ఎం ఎన్ ఆర్ గుప్తా కు అంతర్జాతీయ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, క్లిష్ట తరమైన ప్రాజెక్టులను తన ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ నైపుణ్యంతో పూర్తి చేసిన తెలుగు సంచలనం ఎం ఎన్ ఆర్ గుప్తా. ఒమన్ సౌదీ రహదారి పనుల్లో దాదాపు 80 శాతం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయడం , సోహార్ ఎయిర్ పోర్ట్ ఫ్రీ జోన్ ప్యాకేజీ 3 ప్రాజెక్ట్ లో 44 శాతం పనులు 3 నెలల వ్యవధిలో పూర్తి చేయడం పై ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 


వీటితో పాటు సోహార్ పోర్ట్ లో పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో 10 మ్యాన్ మిలియన్ గంటల పనిలో ఎటువంటి జాప్యం లేకుండా, ఎలాంటి అపాయాలు జరుగకుండా పూర్తి చేయడం గుప్తా ప్రతిభ కు మరో మైలు రాయి . ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లు సమర్ధవంతంగా పూర్తి చేయడం అంతర్జాతీయం గా ఎంతో గుర్తింపుని తీసుకొచ్చాయి. ఈ ప్రతిభ తో వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ జాతీయ సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్ సర్టిఫికెట్ ను శుక్రవారం నాడు ఎం ఎన్ ఆర్ గుప్తా కు ప్రదానం చేసారు. అమెరికా, దుబాయ్ ,కువైట్ , ఒమన్ మరియు భారత దేశంతో కలిపి సుమారు 65 అవార్డులను తన ప్రతిభ తో కైవసం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎం ఎన్ ఆర్ గుప్తా మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తన కెంతో సంతోషాన్ని ఇచ్చిందని, దేనితో తన భాద్యత మరింత పెరిగిందని అన్నారు. అమెరికా లాంటి అగ్రశ్రేణి దేశాలు అభివృద్ధి పధంలో దూసుకు పోవడానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అని అన్నారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తం గా యువత కు అపారమైన అవకాశాలున్నాయని, వీటిని తమ తెలివి తేటలతో అంది పుచ్చుకోవాలని తెలిపారు. నేటి యువత ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా లక్ష్యాలను రూపొందించుకోవాలని, వాటి సాధనే లక్ష్యం గా పనిచేయాలని తెలిపారు. ఈ విషయంలో మార్గదర్శనం చేయడానికి తాను ముందు ఉంటానని తెలిపారు . ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు రావడానికి కృషి, పట్టుదల, ప్రాజెక్ట్ ల పై పూర్తి అవగాహన మరియు ప్రతిభని గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్టులు అప్ప గించిన ఒమన్ ప్రభుతం కారణమని తెలిపారు. ఒక తెలుగు వ్యక్తి గా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయడానికి కావాల్సిన సహకారం అందించడానికి తానెప్పుడూ ముందు ఉంటానని తెలియ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com