బోయింగ్స్‌ రద్దు

- March 14, 2019 , by Maagulf
బోయింగ్స్‌ రద్దు

ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమాన ప్రమాదం తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు, తమ విమానాల్ని రద్దు చేస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌, ఇండియా, అమెరికా కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమాన సేవల్ని నిలిపివేశాయి. ఇథియోపియా, సింగపూర్‌, చైనా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా ఈ విమాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించాయి. యూఏఈ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ సైతం ఈ విమాన యాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించిన విషయం విదితమే. తదుపరి నోటీసు ఇచ్చేవరకు యూఏఈ ఎయిర్‌ స్పేస్‌లోకి ఈ విమానాల్ని అనుమతించడంలేదు. ఏ ఆపరేటర్‌ కూడా యూఏఈ నుంచి, యూఏఈ వరకు ఈ విమానాలు నడపడానికి వీల్లేదని ఇప్పటికే జీసీఏఏ ఓ ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని దేశాలు కూడా ఈ విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com