న్యూజిలాండ్‌లో కాల్పల కలకలం

న్యూజిలాండ్‌లో కాల్పల కలకలం

న్యూజిలాండ్‌లో కాల్పలు కలకలం సృష్టించాయి. క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో ఓ ఆగంతుకుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. నల్లరంగు బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపినట్టు స్థానికులు చెపుతున్నారు..

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ దాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. బంగ్లా క్రికెటర్లు అక్కడ నుంచి బయటపడ్డ సయంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Back to Top