రియాద్‌లో షిప్స్‌ ఆఫ్‌ డిజర్ట్‌ సందడి

రియాద్‌లో షిప్స్‌ ఆఫ్‌ డిజర్ట్‌ సందడి

జెడ్డా:మూడవ ఎడిషన్‌ కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ క్యామెల్‌ ఫెస్టివల్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మార్చి 20 వరకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. సౌదీ క్యామెల్‌ క్లబ్‌ - అల్‌ సయాహిద్‌, రియాద్‌ వెలుపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెద్దయెత్తున సందర్శకులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట& వాటర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 10,762 ఒంటెలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా ఒరిజినల్‌ క్యామెల్‌ బ్యూటీ కాంటెస్ట్‌ని శుక్రవారం నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి, యూఏఈ నుంచి, కువైట్‌ మరియు బహ్రెయన్‌ నుంచీ కంటెస్టెంట్స్‌ పాల్గొంటుండడం గమనార్హం.   

Back to Top