మోడీ మెచ్చిన హైదరాబాదీ

మోడీ మెచ్చిన హైదరాబాదీ

హైదరాబాద్: మై భీ.. చౌకీదార్‌ నినాదాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నందుకు ఖైరతాబాద్‌ బీజేపీని సాక్షాత్తు దేశ ప్రధాని ట్విటర్‌ ద్వారా అభినందించారు. నారాయణగూడకు చెందిన కేశబోయిన శ్రీధర్‌ బీజేపీలో సీనియర్‌ నాయకుడు. సోషల్‌ మీడియాలో చురుకుగా వ్యవహరించే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు.

 

ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మై భీ చౌకీదార్‌ నినాదాన్ని అందుకున్నారు. పార్టీ శ్రేణులందరూ ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నినాదాన్ని శ్రీధర్‌ సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్ల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్తున్నట్టు గమనించిన ప్రధాని ట్విటర్‌ ద్వారా శ్రీధర్‌ను అభినందించారు. ప్రధాని అభినందించడం సంతోషంగా ఉందని, సామాన్య కార్యకర్తల కష్టాన్ని కూడా ప్రధాని గుర్తిస్తారనే దానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Back to Top