ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి

- March 18, 2019 , by Maagulf
ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి

దుబాయ్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను అత్యవసరంగా దుబాయ్ హాస్పిటల్లో చేర్పించారు.

ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇపుడు ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్రఫ్‌ను దుబాయ్‌కి తరలించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ తన కాళ్ల మీద నిలబడలేకపోతున్నారనీ, నడవలేకపోతున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యాధి కోసం లండన్‌లో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com