బెల్‌లో ఉద్యోగ అవకాశాలు
- March 22, 2019భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎంబెడెడ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు..
ఎంబెడెడ్ ఇంజనీర్: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్). జనరల్ అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసయితే చాలు.
వయసు: 31.03.2019 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ లకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు
వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని నింపాలి. దరఖాస్తుకు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఏమైనా సందేహాలు ఉంటే [email protected] చిరునామాకు మెయిల్ చేయవచ్చు.
పే స్కేలు: రూ.50,000 – 1,60,000/-
చివరి తేదీ: 10.04.2019
చిరునామా:
Sr Dy General Manager (HR)
Bharat Electronics Limited
I.E.Nacharam,
Hyderabad- 500076
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు