వాట్సాప్‌.. ఫార్వర్డ్‌, ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌

వాట్సాప్‌.. ఫార్వర్డ్‌, ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌

ఫేక్‌ న్యూస్‌ని అరికట్టేందుకు వాట్సాప్‌ గతేడాది 'ఫార్వర్డింగ్‌' ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతరులు పంపించిన సందేశం ఫార్వర్డెడ్‌ మెసేజా కాదా అనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను మెరుగుపరుస్తూ వాట్సాప్‌ సంస్థ తాజాగా మరో రెండు కొత్త టూల్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 'ఫార్వర్డింగ్‌ ఇన్ఫో', 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌' పేరిట వీటిని తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు బీటా దశలో ఉన్నాయి.

పార్వర్డింగ్‌ ఇన్ఫో.. ఇది ఇన్ఫో సెక్షన్‌లో అందుబాటులో ఉంటుంది. పంపిన మెసేజ్‌లు డెలివరీ అయ్యాయా.. అటువైపు ఉన్నవారు చదివారా అనే వివరాలను ఇది తెలియజేస్తుంది. ఇకపై మనం పంపిన సందేశాన్ని ఫార్వర్డ్‌ చేస్తే ఆ విషయాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. అలా ఎన్నిసార్లు మన మెసేజ్‌ ఫార్వర్డ్‌ అయిందో కూడా తెలుపుతుంది.

ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌.. ప్రస్తుతం వాట్సాప్‌లో ఫార్వర్డెడ్‌ ఆప్షన్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏదేనా మెసేజ్‌ నాలుగు కంటే ఎక్కువసార్లు ఫార్వర్డ్‌ అయితే వెంటనే 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌' అని టాప్‌లో చూపిస్తుంది.

బీటా వెర్షన్‌లో వీటిని పరీక్షిస్తున్నప్పటికీ.. ఇవి అందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. తర్వాతి అప్‌డేట్‌లో వాట్సాప్‌ బీటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫేక్‌ ఇమేజ్‌లను అరికట్టేందుకు 'రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌' ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకురానున్న సంగతి తెలిసిందే.

Back to Top