'పీఎం కిసాన్‌' రెండోవిడత ఆర్థికసాయం!

'పీఎం కిసాన్‌' రెండోవిడత ఆర్థికసాయం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద రెండో విడత నగదు బదిలీ ఏప్రిల్‌ 1 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందే ఈ పథకం కింద 4.74 కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులను ఎంపిక చేశారు. ఇప్పటికే 2.74 కోట్ల మంది ఖాతాల్లో తొలివిడతగా రూ.2000 చొప్పున జమచేశారు. మిగతావారి ఖాతాల్లోనూ ఈనెలాఖరులోగా నగదు జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ నుంచీ అనుమతులొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా ఉన్నాయి.

Back to Top