ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న వారి జాబితా మీ కోసం

- March 24, 2019 , by Maagulf
ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న వారి జాబితా మీ కోసం

బాలీవుడ్ 64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. తారల నవ్వులు, డాన్స్‌లతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. 2018లో చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ నటిగా ఆలియా భట్‌, నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా సారా అలీ ఖాన్‌ ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్నారు. 'రాజీ' సినిమా వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారి జాబితాను మీ కోసం..

• ఉత్తమ చిత్రం: రాజీ
• ఉత్తమ చిత్రం (క్రిటిక్‌): అంధాధున్‌
• ఉత్తమ నటి: ఆలియా భట్‌ (రాజీ).
• ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (సంజు). • ఉత్తమ నటి (క్రిటిక్‌): నీనా గుప్తా (బదాయీ హో).
• ఉత్తమ నటుడు (క్రిటిక్‌): రణ్‌వీర్‌ సింగ్‌ (పద్మావత్‌).
• ఉత్తమ నటి (పరిచయం): సారా అలీ ఖాన్‌ (కేదార్‌నాథ్‌)
• ఉత్తమ నటుడు (పరిచయం): ఇషాన్‌ ఖత్తర్‌ (బియాండ్‌ ది క్లౌడ్స్‌).
• ఉత్తమ దర్శకురాలు: మేఘనా గుల్జార్‌ (రాజీ).
• ఉత్తమ దర్శకుడు (పరిచయం): అమర్‌ కౌశిక్‌ (స్త్రీ).
• ఉత్తమ సహాయ నటుడు: గజరాజ్‌ రావు (బదాయీ హో), విక్కీ కౌశల్‌ (సంజు).
• ఉత్తమ సహాయ నటి: సురేఖ సిక్రి (బదాయీ హో).
• ఉత్తమ మాటల రచయిత: అక్షత్‌ ఘిల్దియల్‌ (బదాయీ హో).
• ఉత్తమ కథా రచయిత: అనుభవ్‌ సిన్హా (ముల్క్‌).
• ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: పద్మావత్‌.
• ఉత్తమ గాయకుడు: అర్జీత్‌ సింగ్‌ (రాజీ-యే వతన్‌).
• ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్‌ (పద్మావత్‌-ఘూమర్‌).
• ఉత్తమ సాహిత్యం: గుల్జార్‌ (రాజీ- యే వతన్‌).
• ఉత్తమ నేపథ్య సంగీతం: డేనియల్‌ జార్జ్‌ (అంధాధున్‌).
• ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: కునాల్‌ శర్మ (తుంబాడ్‌).
• ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: కృతి మహేశ్‌ మిద్య, జ్యోతి తోమర్‌ (పద్మావత్‌-ఘూమర్‌).
• ఉత్తమ సినిమాటోగ్రఫీ: పంకజ్‌ కుమార్ (తుంబాడ్‌).
• ఉత్తమ ఎడిటింగ్‌: పూజా లతా సూర్తి (అంధాధున్‌).
• ఉత్తమ కాస్ట్యూమ్‌: శీతల్ శర్మ (మాంటో).
• ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: నితిన్ జిహానీ చౌదరి, రాజేష్‌ యాదవ్‌ (తుంబాడ్‌).
• ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: రెడ్‌ చిల్లీస్‌ (జీరో).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com