వెదర్‌ అప్‌డేట్‌: ఈ వారంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం

వెదర్‌ అప్‌డేట్‌: ఈ వారంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం

యూఏఈ రెసిడెంట్స్‌ ఈ వారంలో భారీ వర్షాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లుగా వుండొచ్చు. విజిబిలిటీ ఇంటర్నల్‌ నార్తరన్‌ ప్రాంతాల్లో 2000 మీటర్లకు తగ్గుతుందని ఎన్‌సిఎం వివరించింది. అరేబియన్‌ గల్ఫ్‌ సముద్రం చాలా రఫ్‌గా వుంటుంది. ఒమన్‌ సముద్రం కూడా రఫ్‌గా వుంటుంది. మంగళవారం కూడా ఆకాశం మేఘావృతమై వుంటుంది, అక్కడక్కడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. పలు ప్రాంతాల్లో వడగళ్ళు పడే ప్రమాదం లేకపోలేదు. ఆదివారం అబుదాబీ, అల్‌ అయిన్‌, షార్జా, అజ్మాన్‌, ఉమ్‌ అల్‌ కువైన్‌, రస్‌ అల్‌ ఖైమా, ఫుజారియా ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడా ఇబ్బందులు ఏర్పడినట్లు రిపోర్ట్స్‌ అందుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

 

Back to Top