కాస్మొటిక్‌ సర్జరీ ఫలితాలపై 90 శాతం అసంతృప్తి

కాస్మొటిక్‌ సర్జరీ ఫలితాలపై 90 శాతం అసంతృప్తి

కువైట్‌: కువైట్‌ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌, ఫ్యామిలీ మరియు అడాలసెన్స్‌ కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ హమౌద్‌ అల్‌ ఖషాన్‌ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం మంది కువైటీ మహిళలు, కాస్మొటిక్‌ సర్జరీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది. రెండు నెలలపాటు ఈ సర్వే జరిగింది. 'పోస్ట్‌ కాప్మొటిక్‌ ఆపరేషన్స్‌ సిండ్రోమ్‌' పేరుతో ఈ స్టడీని అభివర్ణించారు. ఫలితాలు సానుకూలంగా లేకపోవడంతో కాస్మొటిక్‌ సర్జరీలను ఆశ్రయించిన మహిళలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారనీ, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని సర్వే ఫలితాలపై డీన్‌ హమౌద్‌ అల్‌ ఖషాన్‌ చెప్పారు. 1,214 మంది మహిళలు కాస్మొటిక్‌ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. 

 

Back to Top