సిటిజన్‌ కిడ్నాప్‌: ముగ్గురు వలస మహిళల అరెస్ట్‌

సిటిజన్‌ కిడ్నాప్‌: ముగ్గురు వలస మహిళల అరెస్ట్‌

మస్కట్‌: ఒమన్‌ సిటిజన్‌ని కిడ్నాప్‌ చేసి, బంధించిన నేరంలో ముగ్గురు ఆఫ్రికన్‌ మహిళల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. టూరిస్ట్‌ వీసాపై సుల్తానేట్‌లోకి నిందితులైన ఆఫ్రికా మహిళలు ప్రవేశించినట్లు చెప్పారు అధికారులు. తామున్న చోటికి ఒమన్‌ సిటిజన్‌ని రప్పించి, బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దింపారనీ, ఎక్స్‌టార్షన్‌కి పాల్పడ్డారని అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. సిటిజన్‌, బాధితులనుంచి తప్పించుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితులు సోషల్‌ మీడియా వేదికగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

 

Back to Top