వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే మేలు

- March 29, 2019 , by Maagulf
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే మేలు

వేసవిలో కొబ్బరి బొండం నుండి నేరుగా కొబ్బరి నీళ్ళు తాగడం స్వర్గతుల్యం. దీనివల్ల ఉపశాంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, ఎంజైములు, ఆహార ఫైబరు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంది, అదేవిధంగా ఇందులో క్లోరైడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. కొబ్బరినీళ్ల ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాం.

1. కొబ్బరి నీళ్ళు ఎలక్త్రోలైట్ పొటాషియం ఎక్కువగా కలిగిఉండడం వల్ల ఇది శరీర ద్రవాలలో ఎలక్త్రోలైట్ ని తిరిగి భర్తీచేస్తుంది. కొబ్బరి నీళ్ళు తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా ఉపయోగపడతాయి.

2. కొబ్బరినీళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

3. వీటిలోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాల లోని రాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా గొప్పగా తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు,
సేల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్ళను రెండుమూడు వారాల పాటు రాసి వదిలివేస్తే, అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

4. కొబ్బరి నీళ్ళలో ఆమ్ల ఫాస్ఫటేస్, కాటలేస్, డి-హైడ్రోజినేస్, డయాస్టేస్, పెరాక్సిడేస్, ఆర్ ఎన్ ఏ పాలిమేరాసేస్ లాంటి చాలా జీవ ఎంజైమ్‌లు వుంటాయి. మొత్తంమీద ఈ ఎంజైమ్‌లు అరుగుదలకు, జీవక్రియకు దోహదం చేస్తాయి.

5. కొబ్బరి నీళ్ళు వృద్ధాప్య నివారణకు, క్యాన్సర్ తగ్గించే కారకాలుగా, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి.

6. కొబ్బరి నీళ్ళలో సెలేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి, ఇవి కాన్సర్ పైన పోరాటం చేస్తాయని ప్రయోగశాలలో రుజువైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com