ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి..

- April 08, 2019 , by Maagulf
ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి..

బిడ్డ పుట్టినప్పట్నుంచీ ప్రతీరోజూ ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటారు. పాకడం, నిలబడడం, బోర్లా పడడం ఇలా ప్రతీది తల్లిదండ్రులకి ముచ్చటే. కానీ, కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు.. అందరి పిల్లల్లా వారు యాక్టివ్‌గా ఉండరు. ఓ మూలన ఉంటారు. బాధపడుతుంటారు. దీనికి కారణం ఆటిజమ్ అయి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏడాది లోపు నుంచే కనబడినా నాలుగేళ్ల వరకూ మనం గుర్తించలేం . ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నవయసులోనే చిన్నారులను కాటేస్తున్న ఈ వ్యాధిని కొన్ని లక్షణాల గుర్తించండి..

*  నేరుగా కళ్ళల్లోకి చూడలేరు. మనల్ని చూస్తూ మాట్లాడలేరు.
*ఇతరులతో కలవలేరు.. ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు.
* తమకి ఏం కావాలో.. వంటి విషయాలను చెప్పలేరు. మాటలు కూడా సరిగా రాకపోవడం
* చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం.
* ఎక్కువగా ఏడుస్తుండడం, అడిగింది ఇవ్వకపోతే గీ పెట్టడం.
* ఏదైనా వస్తువుపై ప్రేమ పెంచుకుని దానితోనే కాలం గడపడం
* ఎలాంటి ఫీలింగ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం
* వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోకపోవడం
* దెబ్బలు తగిలినా తెలుసుకోలేకపోవడం.
* పిలిస్తే పలకకపోవడం
* శబ్ధాలను పట్టించుకోకపోవడం లేదా చెవులుగట్టిగా మూసుకోకపోవడం
* ఎవర్నీ చూసినా పట్టించుకోకపోవడం
* పిలిచినా పలకకపోవడం

ఇలాంటి సమస్యలే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఆటిజం సోకిన పిల్లల్లో కనబడతుంటాయి. వీటిని గుర్తించి ముందునుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే పరిస్థితిలో మార్పు వస్తుంది. వైద్యుడి సలహాల మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com